Sunday, November 7, 2010

Aakalirajyam - Sapatu etu ledu....

Pallavi: 

సాపాటు ఎటూలేదు పాటైన పాడు బ్రదర్ (2)
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్ (2)

Charanam 1:

మన తల్లి అన్నపూర్ణ మన అన్న దానకర్ణ
మన భూమి వేదభూమిరా తమ్ముడూ మన కీర్తి మంచు కొండరా (2)
డిగ్రీలు తెచ్చుకొని చిప్పచేత పుచ్చుకొని ఢిల్లికి చేరినాము దేహి దేహి అంటున్నాము
దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్
సాపాటు ఎటూలేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్

బంగారు పంట మనది మిన్నేరు గంగ మనది
ఎలుగెత్తి చాటుదామురా ఇంట్లో ఈగల్ని తోలుదామురా
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా (2)
ఆవేశం ఆపుకోని అమ్మ నాన్నదే తప్పా (2)
గంగలో మునకేసి కాషాయం కట్టేయి బ్రదర్
సాపాటు ఎటూలేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్

Charanam 2

సంతాన మూలికలం సంసార బానిసలం
సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడూ సంపాదనొకటి బరువురా
చదవెయ్య సీటులేదు చదివొస్తే పనిలేదు
అన్నమో రామచంద్రా అంటే పెట్టేదిక్కేలేదు
దేవుడిదే భారమని తెంపు చేయరా బ్రదర్
సాపాటు ఎటూలేదు పాటైన పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్ళిలాంటిదే బ్రదర్

No comments:

Post a Comment